లోకల్ రైలులో ప్రయాణికుడిపై దాడి

హైదరాబాద్: రాత్రి లోకల్ ట్రైన్‌లో ప్రయాణికుడిపై దాడి జరిగింది. మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఎంఎంటీఎస్ రైలులో నలుగురు దుండగులు ప్రయాణికుడిపై దాడి చేశారు. డబ్బులు, సెల్‌ఫోన్ ఇవ్వాలంటూ యువకుడిపై దాడికి దిగారు. ఎదురు తిరిగిన అతడిపై పిడిగుద్దులు కురిపించారు. సికింద్రాబాద్ రైల్వే పోలీస్‌స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు బాధితుడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply