స్కూల్ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం

మేడ్చల్: ఓ స్కూల్ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. నగరంలోని కుషాయిగూడ నాగార్జుననగర్ కాలనీలో విద్యార్ధులను తీసుకుని వెళుతున్న బస్సు రోడ్డు పక్కనున్న మురికి కాలువలోకి దూసుకెళ్లింది. అనంతరం కిందపడకుండా పక్కకు ఒరిగిపోయింది. ఆ సమయంలో బస్సులో 11 మంది విద్యార్ధులున్నారు. కాగా.. విద్యార్ధులెవరికీ ఏమీకాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా… ఆసమయంలో రహదారిపై వెళుతున్న స్థానికులు వెంటనే గమనించి విద్యార్ధులను బస్సులోనుంచి బయటకు తీశారు.

Leave a Reply