సింగూరు ప్రాజెక్టులో అమ్మాయి మృతదేహం లభ్యం

సంగారెడ్డి : సెల్ఫీ సరదా కారణంగా సింగూరు ప్రాజెక్టులో శనివారం ఓ ప్రేమ జంట గల్లంతైన విషయం తెలిసిందే. ఆదివారం అమ్మాయి మృతదేహం లభ్యమైంది. యువకుడి మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ అబీబ్‌నగర్‌కు చెందిన నసీరొద్దీన్(19), బోరబండకు చెందిన శరీన్ బేగం(18) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. శనివారం వీరిద్దరితో పాటు మరో ఇద్దరు స్నేహితులు కలిసి సింగూర్ ప్రాజెక్టుకు వచ్చారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం దిగువన నీటి అంచున ఓ బండరాయిపై నసీరొద్దీన్, శరీన్‌బేగంలు సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోయారు. ఇదే సమయంలో జలవిద్యుత్ కేంద్రం వారు విద్యుత్ ఉత్పత్తిలో భాగంగా నీటిని విడుదల చేయడంతో ప్రవాహం మరింత పెరిగి ఇద్దరూ కొట్టుకుపోయారు.

దీంతో మిగతా ఇద్దరు స్నేహితులు భయపడి అక్కడి నుంచి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న ఎస్సై సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టిన విషయం విదితమే.

Leave a Reply