లంచం అడిగితే చెప్పుతో కొట్టండి: కేసీఆర్

సింగరేణి కార్మికుల అన్ని సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆదివారం ప్రగతి భవన్‌లో సింగరేణి కార్మికులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులతో మాట్లాడిన ఆయన.. త్వరలోనే సింగరేణి యాత్ర నిర్వహిస్తానని, కార్మికుల సమస్యలను స్వయంగా పరిశీలించి, పరిష్కరిస్తానన్నారు. సింగరేణి కార్మికులను లంచం అగిడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని అన్నారు. కార్మికులు కూడా లంచం ఇవ్వొద్దన్నారు. ఎవరైనా లంచం అడిగితే.. వారిపై ఫిర్యాదు చేయండని సూచించారు. రేపటి నుంచి సింగరేణి కార్మికులను లంచం అడిగినవారిని… లంచం తీసుకున్నవారిని చెప్పుతో కొట్టాలని వ్యాఖ్యానించారు. సంఘంలో సభ్యత్వానికి కేవలం రూపాయి ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇన్నాళ్లు కార్మిక సంఘం నేతలే బాగుపడ్డారని, వారిని ఎన్నుకున్న కార్మికులు అలాగే ఉన్నారని వ్యాఖ్యానించారు.

Leave a Reply