మరో 48 గంటలపాటు.. తెలంగాణాలో భారీ వర్షాలు

ఉత్తర కర్ణాటక నుంచి రాయలసీమ మీదుగా… తెలంగాణ వరకు భూఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీనికి అనుబంధంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా… తెలంగాణ వరకు మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వివరించారు. రెండింటి ప్రభావంతో మరో 48 గంటలపాటు…తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పారు.

Leave a Reply