వెంకయ్యనాయుడు బూట్లు మాయం

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు నగరంలో వింత అనుభవం ఎదురైంది. ఓ ఇంటికి అతిథిగా వెళ్లి..తిరిగొచ్చేలోపు వేసుకున్న బూట్లు మాయమైపోయాయి. దీంతో వెంకయ్య ఒకింత అసహనానికి గురయ్యారు. నిత్యం జెడ్‌ప్లస్ కేటగిరీ భద్రతలో ఉండే వెంకయ్యనాయుడు. తీరా ఆయన బూట్లే పోవడంపై ఖాకీలు తలలు పట్టుకున్నారు.

అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి బెంగళూరు వెళ్లిన వెంకయ్య..కేంద్రమంత్రులు సదానందగౌడ, అనంత్‌కుమార్‌లతో కలిసి ఎంపీ పీసీ మోహన్ ఇంట్లో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం వెంకయ్య బయటకొచ్చేసరికి షూస్ కనిపించలేదు. దీంతో వట్టి కాళ్లతోనే తిరగాల్సి వచ్చింది. సెక్యూరిటీ సిబ్బంది ఎంపీ ఇంట్లో, ఆవరణలో వెతికినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఎవరైనా పొరపాటున వేసుకుని వెళ్లి ఉండొచ్చని భావించి, తిరిగి కొత్త బూట్లు కొనుక్కుని వెళ్లారు.