శ్రీదేవి మృతి గుండెపోటు కారణంగా కాదు

శ్రీదేవి మృతి గుండెపోటు కారణంగా కాదు: యూఏఈ ఆరోగ్య శాఖ సంచలన ప్రకటన

దుబాయ్‌లో మృతి చెందిన సినీనటి శ్రీదేవి

ప్రమాదవశాత్తూ మృతి చెందారు

బాత్ రూమ్‌లో టబ్‌లో మునిగి చనిపోయారు

దుబాయ్‌లో మృతి చెందిన సినీనటి శ్రీదేవి భౌతిక కాయం ప్రస్తుతం అక్కడి అల్‌ఖుసేనీ పోలీసు శవాగారంలోనే ఉన్న విషయం తెలిసిందే. శ్రీదేవి ప్రమాదవశాత్తూ మృతి చెందారని యూఏఈ ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. ఆమె ప్రమాదవశాత్తు బాత్ రూమ్‌లో టబ్‌లో మునిగి చనిపోయినట్లు తమ వైద్యులు నిర్ధరించారని చెప్పారు. ఆ సమయంలో ఆమె మద్యం తీసుకున్నారని ఫోరెన్సిక్‌ నివేదికలో తేలిందని తెలిపారు. ఆమె గుండెపోటులో చనిపోయారని అందరూ భావించిన విషయం తెలిసిందే.

శ్రీదేవి రక్త నమూనాల్లో ఆల్కహాల్.. ప్రమాదవశాత్తు మృతి

దుబాయ్‌ః శ్రీదేవి మరణానికి సంబంధించి దుబాయ్ అధికారులు ఫోరెన్సిక్ రిపోర్ట్‌ను విడుదల చేశారు. ఆమె ప్రమాదవశాత్తు మృతి చెందింద‌ని, ఇందులో ఎలాంటి కుట్ర లేదని తేల్చి చెప్పారు. అయితే ఆమె రక్త నమూనాల్లో ఆల్కహాల్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదవశాత్తు ఆమె బాత్‌టబ్‌లోని నీళ్లలో మునిగి చనిపోయిందని డెత్ సర్టిఫికెట్‌లో వెల్లడించారు. ఫోరెన్సిక్ నివేదిక రావడంతో ఇక ఆమె మృతదేహాన్ని అప్పగించే ప్రక్రియ వేగవంతం కానుంది. ఆమె పాస్‌పోర్ట్‌ను రద్దుచేయడం, డెత్ సర్టిఫికెట్ ఇవ్వడంలాంటి పనులు ఉన్నాయి. ఈ డాక్యుమెంట్లన్నీ అందుకున్న తర్వాత మృతదేహాన్ని అప్పగించనున్నారు. మరో గంటలో కుటుంబ సభ్యుల చేతికి శ్రీదేవి మృతదేహం ఇచ్చే అవకాశం ఉంది.

శ్రీదేవి మరణం: ఫొరెన్సిక్‌ రిపోర్ట్ లో ఏముంది ?

శ్రీదేవి మరణం పై ఫొరెన్సిక్‌ రిపోర్ట్ వచ్చింది. శ్రీదేవి మరణం వెనుక ఎలాంటి కుట్ర లేదని దుబాయ్‌ పోలీసులు వెల్లడించారు. పూర్తిగా నివేదిక చదివిన పోలీసులు శ్రీదేవి గుండెపోటుతోనే చనిపోయిందని నిర్ధారించారు,

శ్రీదేవి భౌతిక కాయాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు రిలయన్స్‌కు చెందిన 13 సీట్ల ప్రైవేటు జెట్‌ విమానాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్‌అంబానీ దుబాయ్‌కు పంపారు. ఆమె భౌతికకాయాన్ని ముంబయి తరలించేందుకు ఏర్పాట్లను కుటుంబ సభ్యులు ప్రారంభించారు. ఇప్పటికే ఇమిగ్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. కొద్ది సేపట్లో శ్రీదేవి పార్థివదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. భౌతికకాయం మరో గంటలో విమానంలో ముంబయికి బయలుదేరే అవకాశం ఉంది.

శ్రీదేవి చివరి క్షణాలపై షాకింగ్ రిపోర్ట్స్: ఆ పని చేసింది… హోటల్ సిబ్బందా? బోనీ కపూరా?

పరస్పర విరుద్ధమైన రిపోర్ట్స్

శ్రీదేవి గుండెపోటుకు గురైంది దుబాయ్‌లోని జుమైరా ఎమిరేట్స్ టవర్స్ అనే హోటల్‌లో. ఈ హోటల్‌లోనే ఆమె బస చేశారు. ఆమె మరణానికి ముందు హోటల్‌లో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలపై…. పరస్పర విరుద్ధమైన రిపోర్ట్స్ ప్రచారంలో ఉన్నాయి.

ఖలీజ్ టైమ్స్ రిపోర్ట్స్ ప్రకారం

యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన ఆంగ్ల పత్రిక ఖలీజ్ టైమ్స్ రిపోర్ట్స్ ప్రకారం…. బోనీ కపూర్ తన చిన్న కూతురు ఖుషి, మరికొందరితో కలిసి ఇండియా తిరిగి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. శనివారం సాయంత్రం 5.30 గంటలకు శ్రీదేవి బస చేసిన హోటల్ చేరుకుని ఆమెను సర్ ప్రైజ్ చేశారు. శ్రీదేవి, బోనీ ఇద్దరూ కలిసి కొంత సేపు మాట్లాడుకున్నారు. తర్వాత కలిసి డిన్నర్ చేద్దామనుకున్నారు. శ్రీదేవి ప్రెషప్ కావడానికి బాత్రూం వెళ్లారు. 15 నిమిషాలైనా ఆమె తిరిగి రాక పోవడంతో బోనీ వెళ్లి చూడటంతో ఆమె బాత్‌టబ్ లో చలనం లేకుండా పడిపోయి ఉన్నారు.

9 గంటలకు పోలీసులకు

ఖలీజ్ టైమ్స్ రిపోర్ట్స్ ప్రకారం….శ్రీదేవి చలనం లేకుండా పడిపోయి ఉండటంతో బోనీ వెళ్లి లేపడానికి ట్రై చేశాడు. ఆమె ఎంతకీ లేవక పోవడంతో తన స్నేహితుడికి ఫోన్ చేశాడు. వెంటనే దుబాయ్‌లోని రషీద్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్దారించారు. 9 గంటలకు పోలీసులకు సమాచారం అందించారు.

బోనీ కపూర్ ఆమె వెంట లేరంటూ…మిడ్ డే రిపోర్ట్

అయితే మిడ్-డే పత్రిక కథనం మరోలా ఉంది. శ్రీదేవిని బాత్రూంలో చలనం లేకుండా గుర్తించింది మొదట బోనీ కపూర్ కాదని, హోటల్ స్టాఫ్ అంటూ ఆ పత్రికలో వార్తలు వచ్చాయి.

చివరి క్షణాల్లో ఒంటరిగా శ్రీదేవి

హోటల్‌కు చెందిన ఓ ఉద్యోగి మిడ్ డే డైలీతో మాట్లాడుతూ…శ్రీదేవి చివరి క్షణాల్లో తన గదిలో ఒంటరిగానే ఉన్నారని వెల్లడించారు. హోటల్ సిబ్బంది చెప్పిన ఈ విషయం అందరినీ అయోమయంలో నెట్టి వేసింది.

10.30 ప్రాంతంలో రూమ్ సర్వీస్‌కు కాల్ చేసిన శ్రీదేవి

హోటల్ సిబ్బంది చెప్పినట్లు మిడ్ డే పత్రిక పేర్కొన్న కథనంలో….. 10.30 గంటలకు శ్రీదేవి డ్రింకింగ్ వాటర్ కోసం రూమ్ సర్వీస్ కు కాల్ చేశారు. 15 నిమిషాల్లో సర్వర్ రూమ్ వద్దకు చేరుకున్నారు. పలుసార్లు కాలింగ్ బెల్ కొట్టినా శ్రీదేవి నుండి రెస్పాన్స్ రాలేదు.

అలారం మ్రోగించిన సిబ్బంది

అయితే శ్రీదేవి ఎంతకీ తలుపు తీయక పోవడంతో ఆందోళనకు గురైన సిబ్బంది ఎమర్జెన్సీ అలారం మ్రోగించారు. అనంతరం సిబ్బంది అంతా కలిసి రూమ్‌లోకి ఎంటయ్యారు. బాత్రూంలో శ్రీదేవి ప్లోర్ మీద స్పృహ లేకుండా పడిపోయి ఉన్నారు. అపుడు సమయం రాత్రి 11 గంటలు అవుతోందని సిబ్బంది తెలిపినట్లు మిడ్ డే పత్రిక పేర్కొంది.

అప్పటికీ శ్రీదేవి నాడి కొట్టుకుంటోంది

హోటల్ సిబ్బంది శ్రీదేవిని చలనం లేకుండా గుర్తించే సమయానికి ఆమె నాడి ఇంకా కొట్టుకుంటూనే ఉంది. వెంటనే ఆమెను రషీద్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వైద్యులు ఆమె మరణించినట్లు గుర్తించారు.

చనిపోయినపుడు బోనీ కపూర్ వెంట లేరా?

మిడ్ డే కథనం ప్రకారం…. ఆమె చనిపోయిన సమయంలో బోనీ కపూర్ వెంట లేరని, హోటల్ సిబ్బంది మాత్రమే ఉన్నారని పేర్కొనబడి ఉంది.

అభిమానుల్లో అయోమయం

అయితే మీడియాలో వస్తున్న విరుద్ధ కథనాలతో అభిమానుల్లో అయోమయం నెలకొని ఉంది. ఏది ఏమైనా శ్రీదేవి మరణం అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది.