నకిలీ నోట్లు తయారు చేసిన వారిని అరెస్టు చేసిన పోలీసులు


నేరస్థులు
1. పిన్న కార్తీక్ తండ్రి అశోక్ వయస్సు 22 సంవత్సరాలు కులం వైశ్య, గ్రామం చావటి బజార్ చేర్యాల.
2. చీకోటి సంపత్ తండ్రి మల్లేశం వయస్సు 28 సంవత్సరాలు గ్రామం చేర్యాల.
3. పిన్న శోభ భర్త అశోక్ వయస్సు 48 సంవత్సరాలు కులం వైశ్య, గ్రామం చావటి బజార్ చేర్యాల.

ముగ్గురు కలసి నూతన ఇల్లు నిర్మాణం గురించి చేసిన అప్పులు తీర్చడానికి మార్గం లేక దొంగ నోట్లను తయారు చేసి చలామణి చేసి సులువుగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకొని ఓక నెల రోజుల నుండి నకిలీ నోట్లను తయారు చేసే ప్రింటర్ మరియు ఇతర విడి భాగాలను సమకూర్చుకొని చేర్యాల లో పిన్న కార్తీక్ ఇంటి లో నకిలీ నోట్లను తయారు చేయడం జరుగుతుంది, తేదీ 07-10-2017 నాడు సాయంత్రం కార్తీక్ అతని తల్లి శోభ ఇద్దరు కలసి సిద్దిపేట్ పాత బస్సు స్టాండ్ వద్ద మార్పిడి చేయుటకు ప్రయత్నస్తుండగా సిద్దిపేట్ వన్ టౌన్ యస్ ఐ లు. గోపాల్ రావు, రాజేంద్రప్రసాద్, మరియు సిబ్బంది కలిసి నమ్మదగిన సమాచారం పై వెళ్లి అదుపులోకి తీసుకున్నారు వీరిని విచారించగా వంద రూపాయల నోట్లు 200 వరకు తయారు చేసినాము అని తెలిపారు నకిలీ వంద రూపాయల నోట్ల ను 200 పై వారి నుండి స్వాధీనపర్చుకోనారు. మరియు నోట్లను తయారుచేయడానికి ఉపయోగించిన్న ప్రింటర్, పేపర్, పెన్నులు, స్కేల్, చాకులు స్వాధీనపర్చుకోనారు, నోట్ల పైన 0DA 742155, 0DA 160338, 0DA 160347, అనే నకిలీ నెంబర్లు కలవు. ఈరోజు తేదీ: 08-10-2017 పై ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట్ ఎసిపి నర్సింహ్మా రెడ్డి, సిద్దిపేట్ టూ టౌన్ సిఐ ఆంజనేయులు, వన్ టౌన్ యస్ఐలు గోపాల్ రావు, రాజేంద్రప్రసాద్, కానిస్టేబుళ్లు రాంజీ, శివ, ప్రవీణ్,కమలాకర్ రెడ్డి, రవీందర్ పాల్గొన్నారు ఎసిపి గారు కానిస్టేబుల్స్ కు నగదు పురస్కారాన్ని అందజేశారు

Leave a Reply