చిన్నారి మృతి అనుమానాస్పదం

తండ్రిచంపాడని, తాత ఫిర్యాదు
కోమట్లాగూడెంలో విషాదం
చింతకాని: గ్రామానికి చెందిన షేక్‌ సలీంకుబోనకల్‌ మండలం తూటికుంట్ల గ్రామానికి చెందిన సఫియాతో ఎనిమిది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు షారుక్‌, కూతురు షాహిని(5)ఉన్నారు. కొంతకాలం వీరి కాపురం సజావుగా సాగింది. షాహిని పుట్టి న నాటినుంచి దంపతుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. అడపిల్ల పుట్టిందని, అదనపు కట్నం తీసుకురావాలని వేధించే వారు. పెద్ద మనుషుల సమక్షంలో చర్చలు జరిగినా ఫలితం లేకపోయింది.ఈ క్రమంలో భార్యా సఫీయాకు ఆరోగ్యం క్షిణించింది. మూడు నెలల క్రితం చికిత్స చేయించేందుకు ఆమె తండ్రి షేక్‌ హుస్సేన్‌ పిల్లలతో సహా ఆమెను ఇంటికి(తూటికుంట్ల) తీసుకెళ్లాడు.

వారం క్రితం సలీం ఇంటి కి వచ్చి, ఇద్దరు చిన్నారులను కోమట్లగూడెం తీసుకువెళ్లాడు. గురువారం రాత్రి సాహిని అల్లుడు సలీం, తల్లిదండ్రి యాకమ్మ, బజార్‌, అన్న, భార్య ఖాసింవలి, ముంతాజ్‌,సలీం బంధువు ఫాషా చిన్నారిని చంపి తోట్టిలో పడేశారని తాత రోదించారు. ప్రమాదవశాత్తు చనిపోయిందని చిత్రకరించారని కన్నీటి పర్యంతమయ్యాడు. నీటితోట్టి కనీసం అరడుగు కూడా నీళ్లు లేకపోవడంతో ప్లాన్‌ ప్రకారమే సాహినిని హత్య చేసి నీటి తోట్టిలో పడేశారని పలువురు ఆనుమానం వ్యక్తం చేస్తున్నారు.

బాలిక మృతి సమాచారం తెలుసుకున్న వైరా సీఐ మల్లయ్యస్వామి సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంఘటన తీరును పరిశీలించారు. నిందితు లపై కేసు నమోదు చేస్తామని చెప్పారు.

Leave a Reply