మీడియాతో సీఎం చంద్రబాబు

మీడియాతో సీఎం చంద్రబాబు: ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటుపై స్పష్టత ఇవ్వాలని అసెంబ్లీలో కోరాం – కొద్దిసేపటికే అరుణ్ జైట్లీ ప్రెస్ మీట్ పెట్టి.. ప్రత్యేక హోదా కుదరదని, రెవెన్యూ లోటు కేవలం 138 కోట్లేనని, లోటు కింద వచ్చేది 1600 కోట్లేనని అన్నారు – కేంద్ర ప్రాయోజిత పథకాలకు 30 శాతం ఇస్తామని అన్నారు – కేంద్రం రాష్ట్రానికి సహాయం చేసే యోచనలో లేరని అర్థమైంది- ప్రజల్లో సెంటిమెంట్ ఉందని ఇవాళ అసెంబ్లీలో కూడా చెప్పాను – అయినా కూడా కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదు – కేంద్ర క్యాబినెట్‌లో ఉన్న ఇద్దరితో రాజనామా చేయించాలని నిర్ణయించుకున్నాం – మాకు పదవులు ముఖ్యం కాదు
ఈ రోజు కష్టాలు వచ్చినా, ఇబ్బందులు సృష్టించినా, ప్రజల మనోభావాలే ముఖ్యం- అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత విధి లేని పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నాం- ఢిల్లీలో 29 సార్లు మాట్లాడేందుకు ప్రయత్నాలు చేశా- కేంద్ర రాష్ట్ర సంబంధాలను కూడా పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదు- మనం ఉద్దేశించిన పర్పస్ నెరవేరనప్పుడు ఉండటం అనవసరం: సీఎం చంద్రబాబు