ప్రేమించిన వ్యక్తితో యువతికి పెళ్లి

చిలప్‌చెడ్‌: అదృశ్యమైన యువతి ఆచూకీ లభించినట్లు స్థానిక ఎస్‌ఐ మల్లయ్య పేర్కొన్నారు. చిలప్‌చెడ్‌ పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ గత నెల 19న మండల పరిధిలోని ఫైజాబాద్‌ తండాకు చెందిన మెగావత్‌ బన్సీలాల్‌ కూతురు హత్నూర మాడల్‌కు వెళ్లి తిరిగి రాలేదని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కాగా ఆ యువతి స్నేహితుల సమాచారం మేరకు వివరాలు సేకరించగా, యువతి సంగారెడ్డి జిల్లాలోని అందోలు మండలం డాకూర్‌ గ్రామానికి చెందిన జంగనోల్ల నగేశ్‌ అనే యువకుడిని వివాహం చేసుకుంటున్నట్లు చెప్పారు. గురువారం వారిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చామని అన్నారు. యువతిని విచారించగా, ఆమె తన ఇష్టపూర్వకంగానే నగేశ్‌తో వెళ్లానని, దీనిలో ఎటువంటి బలవంతం లేదని తెలిపినట్లు చెప్పారు.

కాగా తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది వెంకటస్వామి, కిషోర్‌, బాగయ్య తదితరులు ఉన్నారు.

Leave a Reply