జగన్ పదవి కాంక్షతో మతాలతో ఆటలు ఆడుతున్నాడా?

జగన్ క్రైస్తవుడు.ఇది జగమేరిగిన సత్యం.కానీ ఈ మధ్య తను నమ్మిన మతం పై నమ్మకం లేదా?లేక తన రాజకీయం కోసం మతాన్ని వాడుకుంటున్నాడా? పదవి కాంక్షతో మతాలతో ఆటలు ఆడుతున్నాడా ?ఇన్ని ప్రశ్నలు కనపడుతున్నాయి.అయితే తను యాజ్ఞాలు యాగాలు చేయడం స్వాముల కాలు పట్టుకోవడం .క్రైస్తవాన్ని అవమానించడమే.ఎందుకంటే ప్రపంచంలో ఏ మతానికైనా కోన్ని నియమ నిబందనలు ఉన్నాయి.తను హిందూ మతంలోకి మారి నిరభ్యతరంగా యజ్ఞాయాగాలు చేసుకోవచ్చు..అయితే తన పదవి వ్యామోహంతో మత రాజకీయం చేస్తున్నాడు..ఈ విషయం ఇప్పటికైనా క్రైస్తవులు గుర్తించాలి.అసలు క్రైస్తవుడు ఎలా ఉండాలి.నియమ నిబందనలు ఏంటో ఒకసారి చూద్దాం.
“కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞకూడ పరిశుద్ధమైనదియు నీతి గలదియు ఉత్తమమైనదియునై యున్నది (రోమా 7:12)”, “ధర్మశాస్త్రము ఆత్మసంబంధమైనదని యెరుగుదుము (రోమా 7:14)”. మనం అన్ని ఆజ్ఞలు పాటించాలి. “ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు, ఒక ఆజ్ఞవిషయము లో తప్పిపోయినయెడల, ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధియగును; వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దనియు చెప్పెను గనుక నీవు వ్యభిచరింపక పోయినను నరహత్య చేసినయెడల ధర్మశాస్త్ర విషయములో అపరాధివైతివి(యాకోబు 2:10,11).” చాలా మంది యేసుక్రీస్తు ధర్మశాస్రము కొట్టివేశాడంటారు. నేను కొట్టివేయలేదు బాబూ అని యేసు చెప్పాడు. “ధర్మ శాస్త్రమునైనను ప్రవక్తల (వచనముల) నైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయు టకు నేను రాలేదు (మత్తయి 5:17)”. అలా మనం తలంచను కుడా తలంచుకూడదు. ఎవరైతే కొట్టివేశాడంటారో వారు యేసుక్రీస్తునే అబద్దికునిగా చేస్తున్నారు. యేసుక్రీస్తు తు.చ తప్పకుండా ధర్మశాస్రము ను పాటించాడు. యేసుక్రీస్తును వెంబడించువాడే నిజమైన క్రైస్తవుడు. “మీరు తన అడుగుజాడలనుబట్టి నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచిపోయెను (1 పేతురు 2:21)”. మరియు “ఆయనయందు నిలిచియున్నవాడనని చెప్పుకొ నువాడు ఆయన ఏలాగు నడుచుకొనెనో ఆలాగే తానును నడుచుకొన బద్ధుడైయున్నాడు. మనమాయనయందు న్నామని దీనివలన తెలిసి కొనుచున్నాము (1 యోహాను 1:5,6)”.

ఆ పది ఆజ్ఞలేంటి?

1. నేను తప్ప నీకు వేరోక దేవుడండకూదడు.

2. దేవుని నామమును వ్యర్ధముగా ఉచ్చరింపకూడదు.

3. విగ్రహారాధన చేయకూడదు.

4. విశ్రాంతిదినమును జ్ఞాపకం చేసుకొని పరిశుద్దముగా ఆచరించవలెను.

5. తల్లిదండ్రులను గౌరవించవలెను.

6. నరహత్య చేయకూడదు.

7. వ్యభిచరింపకూడదు.

8. దొంగిలింపకూడదు.

9. అబద్ధ సాక్ష్యం పలుక కూడదు.

10. పొరుగువానిదగు దేనిని ఆశింపకూడదు.

పై ఆజ్ఞలను గమనించండి. మొదటి నాలుగు ఆజ్ఞలు మనిషికి దేవునికి సంబందించినవి. మిగతా ఆరు మనిషికి మనిషికి సంబందించినవి. “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట (1 యోహాను 5;3)”. ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపా వరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము (రోమా 6:23)”.

కాబట్టి! ఆజ్ఞాతిక్రమమే పాపము.

ఈ 10నియమాలు జగన్ పాట్టిస్తున్నాడా..తను ఈ నియమాలు అన్నీ అతిక్రమించిన వ్యక్తే

Leave a Reply