తెలుగుదేశం పార్టీ నేతలు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద చేపట్టిన నిరాహార దీక్ష భగ్నం చేసిన పోలీసులు
తెలుగు దేశం పార్టీ దీక్షా శిబిరంపై పోలీసులు శుక్రవారం రాత్రి మూకుమ్మడిగా మెరుపుదాడి చేసి దీక్షలో ఉన్న నేతలను అరెస్టు చేశారు.మధ్య రాత్రి ఒంటిగంట ప్రాంతంలో వందలాది మంది పోలీసులు దీక్షా స్థలి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్దకు చేరుకుని దీక్షలో ఉన్న తెలుగు దేశం నాయకులను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే పోలీసుల రాకను గమనించిన తెలుగు దేశం కార్యకర్తలు ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీక్షలో ఉన్న తమ నేతలకు రక్షణ వలయంగా ఏర్పడిన కార్యకర్తలను పోలీసులు ఈడ్చిపడేశారు.
Short URL: http://www.eenadu.us/?p=28806












