క్రైమ్ న్యూస్

డాక్టర్ వృత్తికే మచ్చ- 7వేలమంది జననాంగాల చిత్రీకరణ

వైద్యుడిని దేవుడితో సమానంగా చూస్తారు. కానీ అమెరికాలో ఓ డాక్టర్ వైద్య వృత్తికే మచ్చ తెచ్చేలా వ్యవహరించారు. స్టెతస్కోప్‌ పట్టుకోవాల్సిన చే...

తెలంగాణ వార్తలు

వికలాంగులను ఆదుకోండి

హైదరాబాద్‌ (వి.వి) : చట్టాలు రావాలన్నా, అవి అమలు కావాలన్నా పోరాటాల ద్వారానే సాధ్యమవుతుందని, అందుకు స...

అంతర్జాతీయ వార్తలు

ప్రతీకార చర్యకు సిద్ధమైన ఒబామా..

సిరియా పై నిఘా విమానాలకు అమెరికా అధ్యక్షుడు ఒబామా సై అన్నారు. ఒబామా తీసుకున్న నిర్ణయంతో ఇస్లామిక్‌ స్టేట్‌ తీవ్రవాదులపై విరుచుకుపడవచ...

హైదరాబాద్ జిల్లా వార్తలు

మూడు ముక్కలుగా గ్రేటర్ హైదరాబాద్

రాజశేఖర్‌ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్‌ చుట్టు పక్కల ఉన్న మున్సిపాలిటీలన్నింటికి కలిపి గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సి...

సినిమా వార్తలు

kesha5-aphunt

Kesha New Stills

Kesha New Stills [gallery ids="42088,42089,42091,42095,42094,42093,42092,42096,42098,42097,42099,42103,42101,42100,42102"]...

వికలాంగులను ఆదుకోండి

హైదరాబాద్‌ (వి.వి) : చట్టాలు రావాలన్నా, అవి అమలు కావాలన్నా పోరాటాల ద్వారానే సాధ్యమవుతుందని, అందుకు సంఘాలను ఏర్పాటు చేసుకోవాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల కోసం పాఠశాలలు, కళాశాలలు నామమాత్రంగానే వున్నాయని, అందుకు పాలకుల వైఫల్యమే కారణమని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర చెవిటి, మూగ, మానసిక వైఫల్యం, దృష్టిలోపం పిల్లల తల్లిదండ్రుల సంఘం ఆధ్వర్యాన ఆదివారం ఏర్పాటుచేసిన ‘వికలాంగుల బాలికల విద్య-ప్రాధాన్యం-ప్రభుత్వ పాత్ర’ అనే అంశంపై జరిగిన అఖిలపక్ష సమావేశంలో చాడ చాడ పాల్గొని, ప్రసంగించారు. సంఘం అధ్యక్షురాలు సుధారాణి సమావేశానికి అధ్యక్షత వహించగా, టిజెఎసి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌, ఎఐసిసి కార్యదర్శి జి.చిన్నారెడ్డి, టిఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యులు వై.శ్రీనివాస్‌, పిఒడబ్ల్యు అధ్యక్షురాలు సంధ్య, టిఎన్జీఓ అధ్యక్షులు దేవీప్రసాద్‌ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ వికలాంగ విద్యార్థులు నేడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి ప్రతి గ్రామంలో ప్రత్యేక పాఠశాలను ఏర్పాటుచేయాలని సూచించారు. తద్వారా తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. అంగవైకల్యంగల వారిని అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుందని చాడ అన్నారు. కోదండరామ్‌ మాట్లాడుతూ వికలాంగులకు అన్ని సౌకర్యాలను కల్పించినట్లయితే మామూలు మనుషులతో సరిసమానంగా వారు కూడా అన్నిరంగాల్లో రాణిస్తారన్నారు. టిఎన్‌జిఓ అధ్యక్షులు దేవీప్రసాద్‌ మాట్లాడుతూ గడిచిన ఆరు దశాబ్దాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల పట్ల చూపించిన నిర్లక్ష్య వైఖరి వల్లనే వారు ఈ దుస్థితికి చేరుకున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో సంఘం ప్రధానకార్యదర్శి నల్లకంటి రామకృష్ణ, సిపిఐ గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్యదర్శి డాక్టర్‌ డి.సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రకృతి వైద్యవిధానం అమోఘం

మొయినాబాద్‌ (వి.వి) : నేటి ఆధునిక యుగంలో ప్రకృతిసిద్ధమైన వైద్యాన్ని అందించడం ఎంతో అమో ఘమైన విషయమని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ సిరిగొండ మధుసూదనాచారి అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్‌ మండల పరిధిలోని అమ్డాపూర్‌ గ్రామ పంచాయతీకి అనుబంధ గ్రామ మైన నజీబ్‌నగర్‌లో డా|| మధుబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంజీవిని ఎక్స్‌క్లూసివ్‌ నేచర్‌క్యూర్‌ సెంటర్‌ను స్పీకర్‌ మధుసూదనాచారి ప్రారంభించా రు. కార్యక్రమంలో రవాణశాఖమంత్రి పి.మహేందర్‌ రెడ్డి, చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్యలు కూడా పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో స్పీకర్‌ మాట్లాడుతూ మానవుడు ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా ఎంతో శ్రమిస్తూ తనకు కావలసినదాన్ని పొందుతున్నాడు. కానీ, తన ఆరో గ్యాన్ని ఫణంగా పెట్టి ఎంతో నిరుత్సాహానికి గురవు తున్నాడన్నారు. 50 ఏళ్ళ క్రితం మనతాతలు, తండ్రు లు ప్రకృతిలో దొరికే వనమూలికలతో వారి ఆరోగ్యా న్ని కాపాడుకునేవారని, కానీ, ప్రస్తుతం ఎన్నో ఇంగ్లీష్‌ మందులు అందుబాటులో ఉన్నా మన ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోతున్నామని చెప్పారు. ఈ ఆసుపత్రిని మండల, నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసు కోవాలని సూచించారు. మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ చక్కటి వాతావరణంలో ఏర్పాటు చేసిన ఆయుర్వేదిక్‌ దవాఖానాను ప్రజలు వినియోగించు కోవాలని రాష్ట్ర రవాణశాఖ మంత్రి పట్నం మహేం దర్‌రెడ్డి, చేవెళ్ళ ఎమ్మెల్యే కాలె యాదయ్యలు పేర్కొ న్నారు. నియోజకవర్గంలోని ప్రజల ఆరోగ్యం నిమిత్తం అధిక ప్రాధాన్యతనిచ్చి తక్కువ ఫీజులను తీసుకోవాలని వారు సంజీవినీ యాజమాన్యానికి సూచించారు. కార్యక్రమంలో పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, రాష్ట్ర ఉద్యోగుల నేత విఠల్‌, చెన్నూర్‌ ఎమ్మెల్యే ఎన్‌.ఓబెలు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌, జెడ్పీటిసి చంద్రలింగంగౌడ్‌, మాజీ జడ్పీటిసి అనంత్‌రెడ్డి, ఎంపిపి ముదిగొండ అనితా శ్రీహరియాదవ్‌, మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షు డు పి.మల్లెష్‌యాదవ్‌, నాయకులు దారెడ్డి కృష్ణారెడ్డి, కండిక రమేష్‌, కొండల్‌గౌడ్‌, కుమ్మరి రమేష్‌, ముది గొండ శ్రీహరియాదవ్‌, శ్రీనివాస్‌యాదవ్‌, కీసరి సంజీవరెడ్డి, విష్ణువర్దన్‌రెడ్డి, సర్పంచ్‌లు సుధాకర్‌ యాదవ్‌, సిద్ధయ్య, జిల్లా బిసి సంఘాల ప్రధాన కార్యదర్శి చేగూరి రామకృష్ణగౌడ్‌, క్రిష్ణారెడ్డి, దర్శన్‌, పైలు శ్రీనివాస్‌, కంజర్ల రవికుమార్‌ పాల్గొన్నారు.

మెదక్ ఎన్నికలకి అగ్ర పార్టీలు సిద్ధం

మెదక్ ఎంపి ఉప ఎన్నికలకి మూడు అగ్ర పార్టీ లు సిద్ధం అయ్యాయి . వారి వారి అభ్యర్దులని ప్రకటించేసాయి . మెదక్ లోక్ సభ అభ్యర్తిగా జగ్గారెడ్డి పేరును బిజెపి పార్టీ అధికారికంగా ప్రకటించారు.  బిజెపి అభ్యర్థిగా జగ్గారెడ్డి నామినేషన్ చేయనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. అదేవిధంగా కాంగ్రెస్ తరుపున సునితా లక్ష్మారెడ్డి మరియు టీఆర్ఎస్ తరుపున కొత్త ప్రభాకర్ రెడ్డి భరి లోకి దిగనున్నారు .

ప్రతీకార చర్యకు సిద్ధమైన ఒబామా..

సిరియా పై నిఘా విమానాలకు అమెరికా అధ్యక్షుడు ఒబామా సై అన్నారు. ఒబామా తీసుకున్న నిర్ణయంతో ఇస్లామిక్‌ స్టేట్‌ తీవ్రవాదులపై విరుచుకుపడవచ్చని అమెరికన్ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఇరాక్‌లో ఇస్లామిక్‌ స్టేట్‌ తీవ్రవాదులపై అమెరికా వైమానిక దాడులు చేస్తోంది. ఉత్తర ఇరాక్‌లో మానవతా సంక్షోభం నెలకొంటుందని, ముఖ్యంగా ఆ దేశంలోని తమ పౌరులకు ప్రాణాపాయం ఏర్పడుతుందనే సాకుతో అమెరికా దాడులు చేస్తుంది.  ఇటీవల ఇరాక్‌ తీవ్రవాదులు నిష్కారణంగా అమెరికన్‌ జర్నలిస్టు జేమ్స్‌ ఫోలేను చంపేశారు. ఈ హత్యకు ప్రతీకారంగానే సిరియాపై సైనిక చర్యకు ఒబామా రెడీ అయ్యారని సమాచారం .  అయితే సైనిక చర్య జరిపే ముందు అవసరమైన సమాచారాన్ని మాత్రం ఒబామాకు అందజేస్తామని ఇంటెలిజెన్స్‌ అధికారులంటున్నారు.

ఆధారాలు చూపిస్తే పదవి నుండి తప్పుకుంటా ..

కొద్ది రోజులుగా తనపై, తన కుటుంబంపై దుష్ప్రచారం జరుగుతుంది అని హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు . తాను కానీ, తనవారు కానీ తప్పు చేసినట్లు ప్రాథమిక ఆధారాలు చూపినా తక్షణం తాను పదవి నుండి తప్పుకొంటామని ఆయన పేర్కొన్నారు. పుకార్లపై స్వయంగా ప్రధాని, పార్టీ అధ్యక్షుడికి వివరించానన్నారు. అది విన్న వెంటనే ప్రధాని, పార్టీ అధ్యక్షుడు ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు తెలిపారు. మరోవైపు రాజ్‌నాథ్ కుటుంబంపై వస్తున్న ఆరోపణలను పీఎంవో కార్యాలయం కొట్టిపారేసింది. రాజ్‌నాథ్‌పై వస్తున్న ఆరోపణలు పచ్చి అబద్దాలని పేర్కొంది. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకే ఇలాంటి అపోహలను సృష్టిస్తున్నారని మండిపడింది.

>> ఈ ఏడాది డీఎస్సీ, టెట్ ఒకేసారి – గంటా

ఈ ఏడాది జరగనున్న డీఎస్సీ, టెట్ ఒకేసారి నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ మాననవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్దులు, ఉపాధ్యాయులు స్కూలుకి హాజరవుతున్న విషయాన్ని ఖచ్చితంగా పర్వవేక్షించడానికి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి 10 గ్రామాలకు ఒక క్లస్టర్ స్కూల్ ను ఎంపిక చేసి ఆ పాఠశాలలో విద్యకు సంబంధించిన అవగాహన, శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం పాఠశాలల పనితీరు కార్పోరేట్ పాఠశాలలకు మించి ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 17 విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు కేంద్రానికి పంపామన్నారు.

>> ఆధారాలు చూపిస్తే పదవి నుండి తప్పుకుంటా ..

కొద్ది రోజులుగా తనపై, తన కుటుంబంపై దుష్ప్రచారం జరుగుతుంది అని హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు . తాను కానీ, తనవారు కానీ తప్పు చేసినట్లు ప్రాథమిక ఆధారాలు చూపినా తక్షణం తాను పదవి నుండి తప్పుకొంటామని ఆయన పేర్కొన్నారు. పుకార్లపై స్వయంగా ప్రధాని, పార్టీ అధ్యక్షుడికి వివరించానన్నారు. అది విన్న వెంటనే ప్రధాని, పార్టీ అధ్యక్షుడు ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు తెలిపారు. మరోవైపు రాజ్‌నాథ్ కుటుంబంపై వస్తున్న ఆరోపణలను పీఎంవో కార్యాలయం కొట్టిపారేసింది. రాజ్‌నాథ్‌పై వస్తున్న ఆరోపణలు పచ్చి అబద్దాలని పేర్కొంది. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకే ఇలాంటి అపోహలను సృష్టిస్తున్నారని మండిపడింది.

ఔట్‌సోర్సింగ్‌ నర్సింగ్‌, పారామెడికల్‌ సిబ్బందిని పర్మినెంట్‌ చేయండి

హైదరాబాద్‌ (వి.వి) : అనేక ఏళ్లుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ నర్సింగ్‌, పారామెడికల్‌ సిబ్బందిని పర్మినెంట్‌ చేయాలని ఎఐటియుసి జాతీయ కార్యదర్శి బి.వి.విజయలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెలంగాణ మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌, తెలంగాణ మెడికల్‌ కాంట్రాక్టు వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ సంయుక్త ఆధ్వర్యాన శనివారం ఎఐటియుసి రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర సదస్సు జరిగింది. సదస్సుకు ముఖ్యఅతిథులుగా విజయలక్ష్మితో పాటు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ కాంట్రాక్టు లేబర్‌ రెగ్యులేషన్‌ అండ్‌ అబాలిషన్‌ యాక్టు ప్రకారం శాశ్వత పని విధానం వున్న సంస్థలో పర్మినెంట్‌ కార్మికులను నియమించాలి. కానీ, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలను తుంగలో తొక్కి కాంట్రాక్టు పద్ధతిన కార్మికులను తీసుకుంటున్నాయని విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔట్‌సోర్సింగ్‌ ద్వారా పనిచేస్తున్న నర్సులను కాంట్రాక్టు వ్యవస్థ ద్వారా నియమించుకుంటూ శ్రమదోపిడీకి గురిచేస్తున్నారని మండిపడ్డారు. నర్సింగ్‌ వృత్తికి గౌరవం తెచ్చిన పోర్గెన్స్‌ నైటింగల్‌, మధర్‌థెరిస్సా లాంటి వారిని ఆదర్శంగా తీసుకుని నర్సులు పనిచేస్తున్నారని తెలిపారు. చట్టంప్రకారం సంస్థలో ఆరు నెలలు ప్రసూతి సెలవులు, ఏడాదికి 35 సెలవులు ఇవ్వాల్సి వున్నా, దానిని అమలు చేయటం లేదని విమర్శించారు. నిరంతరం రోగులకు సేవలు చేస్తున్న నర్సింగ్‌ సిబ్బందిని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని పర్మినెంట్‌ చేయాలని విజయలక్ష్మి డిమాండ్‌ చేశారు. చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేస్తామని ఎన్నికలకు ముందు టిఆర్‌ఎస్‌ హామీనిచ్చిందని, అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీని నెరవేర్చకుండా, బడా పారిశ్రామికవేత్తలకు వత్తాసు పలుకుతూ వారి చుట్టూ తిరుగుతుందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేస్తూ, ఔట్‌సోర్సింగ్‌ నర్సింగ్‌ సిబ్బందిని పర్మినెంట్‌ చేయాలని చాడ వెంకటరెడ్డ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లేనిపక్షంలో తెలంగాణ ప్రజలు చైతన్యవంతమై వున్నారని, పోరాడి సాధించుకునేందుకు వెనుకడుగు వేయరని హెచ్చరించారు. ఎఐటియుసి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు టి.నరసింహన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు కార్మికులు ప్రభుత్వంపై అనేక ఆశలు పెట్టుకున్నారని తెలిపారు. కానీ, ప్రభుత్వం వారి హామీలను అమలు చేయటంలో నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. వెంటనే ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని పర్మినెంట్‌ చేసేవరకు సమాన పనికి సమాన వేతనం చట్టాన్ని అమలు చేయాలని నరసింహన్‌ డిమాండ్‌ చేశారు. ముందుగా నాయకులు సంగీత సదస్సుకు అధ్యక్షత వహించగా, రామలక్ష్మీ స్వాగతం పలికారు. ఈ సదస్సులో మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎన్‌.నారాయణరెడ్డి, మెడికల్‌ కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి.యూసుఫ్‌, ఎస్‌.విఠల్‌, బి.నారాయణరెడ్డి, ఎం.నర్సింహ, జెన్నిపర్‌ గ్రేస్‌ కార్పెట్‌, ఎ.ప్రమీళ, ఎం.ఆరోగ్యమ్మ, జిహెచ్‌ లక్ష్మీ, బి.మేఘమాల, బి.ప్రమీల, మేరి, విజయ, జ్యోతి, సంగీత, మాధవి, రాము తదితరులు పాల్గొన్నారు.

విజయదశమి నాటికి ఎపి సిఎం కార్యాలయం సిద్ధం

హైదరాబాద్‌ (వి.వి) : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కోసం సచివాలయంలోని ఎల్‌ బ్లాక్‌లో కేటాయించిన కార్యాలయం విజయదశమి నాటికి సిద్ధం కానుంది. అక్టోబర్‌ 3న తేదీ విజయదశమి రోజున తన ఛాంబర్‌లోకి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబు నాయుడు అడుగు పెట్టనున్నట్లు సమాచారం. గత రెండు నెలలుగా ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాటు పనులు నడుస్తున్నాయి. మొత్తం పనులు సెప్టెంబర్‌ నెలాఖరు నాటికి పూర్తికానున్నాయి. ముందుగా ముఖ్యమంత్రి కార్యాలయం కోసం హెచ్‌ బ్లాక్‌ కేటాయించారు. అయితే, ముఖ్యమంత్రి సూచనల మేరకు వాస్తు, భద్రత తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని ఎల్‌ బ్లాక్‌లోని ఏడు, ఎనిమిది అంతస్తులను కేటాయించారు. ఇటీవల చంద్రబాబు సచివాలయాన్ని సందర్శించి, తన కోసం కేటాయించిన ఛాంబర్‌ పనులను పరిశీలించి, పనులు తొందరగా పూర్తి చేయూల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఛాంబర్‌ ఏర్పాటు పనులను వేగవంతం చేశారు. సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయం సిద్ధం కాకపోవడంతో అధికారిక వ్యవహారాలన్నీ లేక్‌వ్యూ అతిధి గృహం నుంచి నడస్తున్న సంగతి తెలిసిందే. ఛాంబర్‌ సిద్ధం కాకపోవడంతో చంద్రబాబు నాయుడు తన నివాసగృహం, లేక్‌వ్యూ అతిథి గృహం నుంచి పరిపాలన వ్యవహారాలు అధికారులతో సమీక్షిస్తున్నారు. మరోపక్క జిల్లాల నుంచి ముఖ్యమంత్రిని కలిసేందుకు వస్తున్న సందర్శకుల తాకిడి ఎక్కువైంది. ఈ నేపథ్యంలో అతిథి గృహం వద్ద సందర్శకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భద్రతాంశాలను దృష్టిలో ఉంచుకుని సందర్శకులను మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ముఖ్యమంత్రిని కలిసేందుకు అనుమతిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సందర్శకులు లేక్‌వ్యూ అతిథిó గృహం బయటగల రోడ్లు, చెట్ల కిందే గడుపుతున్నారు. వర్షం పడితే కనీసం నిలబడేందుకు షెడ్లు కూడా లేవు. కాగా, రాష్ట్ర విభజన అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సచివాలయంలో ఏర్పాటు చేయకపోవడంతో గత రెండునెలలుగా పాలనా వ్యవహారాలు అరకొరగా సాగుతున్నాయి.

ఈ ఏడాది డీఎస్సీ, టెట్ ఒకేసారి – గంటా

ఈ ఏడాది జరగనున్న డీఎస్సీ, టెట్ ఒకేసారి నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ మాననవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్దులు, ఉపాధ్యాయులు స్కూలుకి హాజరవుతున్న విషయాన్ని ఖచ్చితంగా పర్వవేక్షించడానికి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి 10 గ్రామాలకు ఒక క్లస్టర్ స్కూల్ ను ఎంపిక చేసి ఆ పాఠశాలలో విద్యకు సంబంధించిన అవగాహన, శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం పాఠశాలల పనితీరు కార్పోరేట్ పాఠశాలలకు మించి ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 17 విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు కేంద్రానికి పంపామన్నారు.

సభకు వైఎస్సార్‌ సిపి అభ్యర్ధులు క్షమాపణ

హైదరాబాద్‌ (వి.వి.) : శాసనసభకు ఎటువంటి ఆటంకం కలిగించలేదని ఆత్మసాక్షిగా నమ్ముతున్నట్లు ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యుడు శివప్రసాద్‌రెడ్డి చెప్పారు. ప్రభుత్వం తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని తనపై సస్పెన్షన్‌ తీర్మానాన్ని ప్రతిపాదించిందన్నారు. స్పీకర్‌ రూలింగ్‌ ఇచ్చిన కారణంగా సభకు క్షమాపణ చెబుతున్నట్లు ఆయన గురువారం నాటి అసెంబ్లీలో ప్రకటించారు. తాము నిరసన చెప్పే క్రమంలో దురదృష్టవశాత్తు మైక్‌ విరిగిపోయి ఉండవచ్చునని, అందుకు తాను చింతిస్తున్నానని చెప్పారు. రెండు రోజుల క్రితం స్పీకర్‌ ముందున్న మైక్‌ విరిచినందుకు శివప్రసాద్‌రెడ్డి, మణిగాంధీలను సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. క్షమాపణ చెబితే సస్పెన్షన్‌ను రద్దుచేస్తానని స్పీకర్‌ ప్రకటించడంతో శివప్రసాద్‌రెడ్డి ఈ వివరణనిచ్చారు. మరొక సభ్యుడు మణిగాంధీ మాట్లాడుతూ ఉద్దేశ్యపూర్వకంగా తాను ఏ తప్పు చేయలేదన్నారు. నిరసన వ్యక్తం చేసే క్రమంలో మైక్‌కు చేయి తగిలిందని, అందుకు తనను క్షమించవలసిందిగా స్పీకర్‌ను కోరారు. దీంతో వీరిద్దరిపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.

108, 104 సేవలు మెరుగుపరుస్తాం

హైదరాబాద్‌,(వి.వి.) : రాష్ట్రంలో 108, 104 సేవలను మెరుగుపరుస్తామని, దీనిలో భాగంగా 145 నూతన అంబులెన్సులను కొనుగోలు చేశామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాసరావు వెల్లడించారు. శిశుపరమైన ఎమర్జెనీలను పటిష్టపరిచేందుకు ఏడు నియోనాటల్‌ అంబులెన్సులను ఏర్పాటు చేశా మన్నారు. శాసనమండలిలో గురువారం 104, 108 సేవలు సక్రమంగా పనిచేయడం లేదన్న విషయం వాస్తవమేనా అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యుడు ఆదిరెడ్డి అప్పారావు అడిగిన ప్రశ్నకు మంత్రి కామినేని పై మేరకు సమాధానం చెప్పారు. అత్యవసర చికిత్సపై టెక్నిషియన్లకు శిక్షణ ఇస్తున్నామని, ప్రగతి సూచికలపై పర్యవేక్షి స్తున్నామని చెప్పారు. కార్యనిర్వాహక మండలి ఆధ్వర్యంలో 108 సేవలపై ఎప్పటికప్పుడు సమీ క్షలు జరుపుతున్నామని, 104 సర్వీసులను సీని యర్‌ ప్రజారోగ్య అధికారులు సునిశితంగా పర్య వేక్షిస్తున్నారని తెలిపారు. 42 రకాల మందులను 108 వాహనంలో అందుబాటులో ఉంచు తున్నామని, ఒక్కొక్క ఎంహెచ్‌యుకు నెలకు రూ.17000 నుంచి రూ.40000 విలువైన మందులు కొనుగోలు చేసుకునేందుకు వెసులు బాటు కల్పించామన్నారు.

రెవిన్యూ సదస్సులు లేకుండా

పట్టాదారు పాస్‌పుస్తకాలు : కె.ఇ

రెవెన్యూ సదస్సులు అవసరం లేకుండానే రైతులకు పట్టదారు పాసుపుస్తకాలు అందజేసే అంశాన్ని పరిశీలిస్తాని ఉప ముఖ్యమంత్రి కె.ఇ. కృష్ణమూర్తి తెలిపారు. గురువారం మండలిలో

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని రెవెన్యూ సదస్సులు నిర్వహించారని కాంగ్రెస్‌ సభ్యులు బి.చెంగల్‌ రాయుడు, రుద్రరాజు పద్మరాజులు అడిగిన ప్రశ్నకు ఉప ముఖ్యమంత్రి కృష్ణమూర్తి సమా ధానం చెప్పారు. 2012-13 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ సదస్సులు నిర్వహించామని చెప్పారు. 2012వ సంవత్స రంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల నుంచి 3,65,456 పిటిషన్లు అందాయని, అందులో 2,65,927 పిటిషన్లు ఆమోదించి, 99,529 పిటిషన్లను తిరస్కరించామన్నారు. 2013వ సంవత్సరంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో 13 జిల్లాల నుంచి 5,79,561 పిటిషన్లు అందగా, వాటిలో 4,71,103 ఆమోదించామని, 94,840 పిటిషన్లు తిరస్కరించామని ఆయన వెల్లడించారు.

కరువుపై తక్షణం స్పందించండి

హైదరాబాద్‌ (వి.వి) : రాష్ట్రంలో ఏర్పడిన కరువు పరిస్థితులపై తక్షణమే స్పందించి రైతుల రుణమాఫీ, కరువు సహాయక చర్యలు, కరెంటు కొరత నివారణకు, విద్యుత్‌ కొనుగోలుకు యుద్ధప్రాతిపదికన ప్రత్యేక కృషి చేయాలని ప్రభుత్వాన్ని సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి డిమాండ్‌ చేసింది. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు బుధవారం ఈ మేరకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి లేఖ రాశారు. రైతు రుణాల రీషెడ్యూలుకు అవకాశంలేదని, రుణమాఫీ పథకం తప్పుడు సంకేతాలు కలిగిస్తుందని, ఆర్‌బిఐ పదేపదే ప్రకటన చేస్తుందని, దీంతో రైతులు నిరాశానిస్పృహలకు గురవుతున్నారని, ప్రభుత్వ ప్రకటనలో కూడా స్పష్టత కనబడటం లేదని, అర్హులైన రైతులకు ప్రభుత్వం నేరుగా చెల్లిస్తే తప్ప రుణమాఫీ అమలు జరిగే పరిస్థితి కనబడడం లేదని చాడ అన్నారు. రైతులకు బాండ్లు ఇస్తామని, వాటికి రెండు, మూడు సంవత్సరాల్లో డబ్బు చెల్లిస్తామని వెలువడుతున్న అసంబంధమైన ప్రకటనలు రైతులను గందరగోళ పరుస్తున్నాయని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ అమలుపై విధివిధానాలు ప్రకటించి, రైతులకు మానసిక స్థైర్యాన్ని కలిగించాలని ముఖ్యమంత్రిని కోరారు. వర్షాభావ పరిస్థితులతో వరి, తదితర పంటలు ఎండిపోతున్నాయని, రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, బావులు, బోర్లలో నీరు ఎండిపోయిందని, మరొకవైపు దెబ్బమీద దెబ్బలాగా కరెంటు కోతతో రైతులు దిక్కుతోచని స్థితికి నెట్టబడ్డారని, విద్యుత్‌ కొనుగోలుకు ప్రభుత్వం తీవ్రంగా కృషిచేయడం లేదనే భావనలు వ్యక్తమవుతున్నాయని చాడ ఆ లేఖలో పేర్కొన్నారు.

రక్షణరంగంలో ఎఫ్‌డిఐలతో ముప్పు : నారాయణ

బెల్లంపల్లి (వి.వి) : రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డిఐ) దేశభద్రతకు ముప్పు అని సిపిఐ జాతీయ సమితి కార్యవర్గ సభ్యులు డా|| కె.నారాయణ అన్నారు. బుధవారం బెల్లంపల్లిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభంజనం కార్పొరేట్‌ మీడియా సృష్టేనని, కర్ణాటక, బీహార్‌ ఉపఎన్నికల్లో మోడీ ప్రభంజనంలో వాస్తవం లేదని తేలిపోయిందన్నారు. త్వరలో మెదక్‌లో జరిగే ఉపఎన్నికల్లో టిడిపి, బిజెపిలను ఓడించేందుకు తమవంతు ప్రయత్నం చేస్తామన్నారు. న్యాయవ్యవస్థ ప్రక్షాళన, విద్యారంగంలో ఆర్‌ఎస్‌ఎస్‌ పాఠాలు జొప్పించడం, బ్యాంకుల ప్రైవేటీకరణ వంటి ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు వామపక్ష పార్టీలు పెద్దఎత్తున ఆందోళన చేసేందుకు సిద్ధం కావాలన్నారు. రుణమాఫీలను ఆర్‌బిఐ గట్టిగా తిరస్కరిస్తోందని, మరి టిడిపి, టిఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు ఏమి చేస్తాయో ప్రజలకు వివరించాలని నారాయణ డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ సంస్కరణల పేరుతో టిఆర్‌ఎస్‌ డిస్కింలను ప్రైవేట్‌పరం చేసే ప్రయత్నంలో ఉందని, ఆ విధంగా చేయడమంటే బషీర్‌బాగ్‌ సంఘటనలో అమరులైన మృతవీరులకు అన్యాయం చేయడమేనని మండిపట్టారు.

టిఆర్‌ఎస్‌, టిడిపిలు కేంద్ర ప్రభుత్వంపై చిత్తశుద్ధితో ఒత్తిడి తీసుకొచ్చి సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందేలా చూడాలని సిపిఐ లేఖ రాసిందన్నారు. ప్రజా సమస్యలపై పోరాటాలకు వామపక్షాలు సన్నద్ధం కావాలన్నారు. పాత్రికేయుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గుండ మల్లేష్‌, సిపిఐ ఆదిలాబాదు జిల్లా సమితి కార్యదర్శి కలవేన శంకర్‌, సహాయ కార్యదర్శి ఎస్‌.విలాస్‌, కార్యవర్గ సభ్యులు చిప్పనర్సయ్య, ఎస్‌.తిరుపతి, పి.శేషగిరిరావు పాల్గొన్నారు.

సొంత ఛానల్ లేక కాంగ్రెస్ ఓడిపోయింది..!!

ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే . కాగా .. కాంగ్రెస్ నాయకులు ఓటమికి కారణాలను ఒక్కోవిధంగా చెప్తున్నారు . ఈ విషయం పై మాజీ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి మాత్రం తమ పార్టీ ఓటమికి సొంత ఛానల్ లేకపోవటమే అని అన్నారు . తమ ప్రభుత్వ విజయాలను ప్రచారం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి సొంత ఛానల్ కాని సొంత వార్తాపత్రిక కాని లేకపోవడం వల్లే పార్టీ ఓడమిపాలైందని ఆయన తెలిపారు . అందువల్ల కాంగ్రెస్ పార్టీ తనకంటూ సొంత ఛానల్ ను, సొంత వార్తాపత్రికను ఏర్పాటు చేసుకోక తప్పదని కూడా ఆయన సలహా ఇచ్చారు. అదే విషయం టిపిసిసి మేథోమథనం సదస్సులో కూడా పునరావృతమైంది. సోమవారం నాటి ముగింపు సమావేశంలో మాట్లాడిన సురేష్ రెడ్డి పదేపదే ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అంతేకాదు..ఛానల్, వార్తాపత్రికను ఏర్పాటు చేసేందుకు ప్రతి కార్యకర్త వెయ్యి రూపాయల చందా ఇవ్వాలని కూడా ఆయన Read more